TG : 2 లక్షల 95వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్

తెలంగాణ బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. గురువారం అసెంబ్లీ కమిటీ హాల్‌లో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశమైంది. 2024-–25 బడ్జెట్‌కు ఆమోదం తెలిపారు. రూ.2 లక్షల 95 వేల కోట్లతో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు శాసనసభలో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క, శాసనమండలిలో మంత్రి శ్రీధర్‌బాబు బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. అగ్రికల్చర్, ఎడ్యుకేషన్ కు బడ్జెట్ లో ఇంపార్టెన్స్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెంచే అవకాశముంది. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున కేటాయింపులు చేయనున్నారు. మూసీ రివర్ ఫ్రంట్‌కు సైతం బడ్జెట్లో నిధులు కేటాయించనున్నట్లు తెలుస్తోంది.
రుణమాఫీకి రూ.31 వేల కోట్లు?
రాష్ట్ర బడ్జెట్ లో రుణమాఫీకి రూ.31 వేల కోట్లు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైతు భరోసాకు రూ.14 వేల కోట్లు, రైతుబీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున కేటాయింపులు జరిగే అవకాశముంది. ఇరిగేషన్‌కు రూ. 25 వేల కోట్ల రూపాయలు పైనే కేటాయించనున్నట్లు సమాచారం. రాబోయే ఆర్థిక ఏడాదిలో ట్యాక్స్ రెవెన్యూ రూ.లక్షా 70వేల కోట్లకుపైగానే వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ రూ. 25 వేల కోట్ల నుంచి రూ. 30 వేల కోట్లు రాబట్టేందుకు ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. రూ. 60 వేల కోట్ల వరకు అప్పులు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇలా అన్నీ కలిపితే బడ్జెట్ రూ.2 లక్షల 95 వేల కోట్లు ఉండే అవకాశముంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com