అమెరికాలో పెట్రోల్‌ ట్యాంకర్‌ను ఢీకొని తెలంగాణ యువకుడు మృతి

అమెరికాలో పెట్రోల్‌ ట్యాంకర్‌ను ఢీకొని తెలంగాణ యువకుడు మృతి
అమెరికాలోని సెల్టన్‌ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు

అమెరికాలోని సెల్టన్‌ ప్రాంతంలో జరిగిన ప్రమాదంలో తెలంగాణకు చెందిన యువకుడు మృతి చెందాడు. నిజామాబాద్‌ కు చెందిన 23ఏళ్ల గుర్రపు శైలేష్‌ చనిపోయాడు. గత ఏడాది ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన శైలేష్‌ వీకెండ్‌ కావడంతో స్నేహితులతో కలసి కారులో వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృతుడు ప్రయాణిస్తున్నకారు పెట్రోల్‌ ట్యాంకర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో శైలేష్‌ కారులోనే సజీవ దహనం అయ్యాడు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరౌతున్నారు.

Tags

Next Story