Talasani Srinivas Yadav : ఐమాక్స్‌లో విద్యార్ధులతో కలిసి సినిమా చూసిన తలసాని శ్రీనివాస్ యాదవ్..

Talasani Srinivas Yadav : తెలంగాణలో స్వాతంత్ర్య వజ్రోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని థ్రిల్ సిటీ వద్ద జాతీయ జెండాలను.. జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేష్‌కుమార్‌తో కలిసి పంపిణీ చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. అనంతరం 3కే రన్‌ను ప్రారంభించారు.
స్వాతంత్ర్య వజ్రోత్సవాలను 22వ తేదీ వరకు ఘనంగా నిర్వహిస్తామని ఆయన తెలిపారు. వన మహోత్సవం, ఫ్రీడమ్ రన్, జాతీయ రక్షా బంధన్, ఫైర్ వర్క్స్, ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, రంగోళి వంటి కార్యక్రమాలు చేపడతామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా కోటి 20 లక్షల జాతీయ జెండాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. 15న అన్ని జంక్షన్లలో జాతీయ గీతాలాపన, 21న లోకల్ బాడీ నుండి అసెంబ్లీ వరకు జనరల్ బాడీ మీటింగ్స్ నిర్వహిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 529 తెరలపై గాంధీ చిత్రాలను ప్రదర్శిస్తామని వెల్లడించారు.
భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణలో గాంధీ చిత్ర ప్రదర్శన నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్ ఐమ్యాక్స్ థియేటర్‌లో గాంధీ చిత్ర ప్రదర్శనను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి చిత్రాన్ని వీక్షించారు. ఆయన వెంట ఎఫ్‌డీసీ ఛైర్మన్ అనిల్, ఎమ్మెల్యే దానం, విద్యాశాఖ అధికారులు ఉన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com