TG : నవంబర్ 7 నుంచి టెట్ దరఖాస్తుల స్వీకరణ

తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ.. దరఖాస్తుల స్వీకరణ ఆలస్యం కానుంది. సాంకేతిక సమస్యలు తలెత్తడంతో ఈ నెల 7 నుంచి దరఖాస్తులు చేసుకోవాలని విద్యాశాఖ స్పష్టం చేసింది. తెలంగాణలో సోమవారం టెట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. తొలుత నవంబర్ 5 నుంచి 20వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పిచేందుకు అవకాశం కల్పించగా.. తాజాగా మార్పులు చేశారు. 2025 జనవరి 1 నుంచి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో కంప్యూటర్ బేస్డ్ పరీక్ష నిర్వహించనున్నారు. ఏటా రెండుసార్లు టెట్ నిర్వహిస్తామని ప్రభుత్వం గతంలో పేర్కొంది. ఈ సంవత్సరం మే 20వ తేదీ నుంచి జూన్ 2 వరకు ఆన్‌లైన్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండో టెట్‌కు నవంబరులో నోటిఫికేషన్ జారీ చేసి జనవరిలో పరీక్షలు జరుపుతామని గత ఆగస్టులో జాబ్ క్యాలెండర్ విడుదల సమయంలో ప్రభుత్వం వెల్లడించింది. ఈ క్రమంలో సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com