TG TET Schedule : తెలంగాణ టెట్ షెడ్యూల్ విడుదల

తెలంగాణ టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) నోటిఫికేషన్‌పై పాఠశాల విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. జూన్ 15 నుంచి 30 మధ్య ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు పేర్కొంది. పూర్తి నోటిఫికేషన్ వివరాలు APR 15 నుంచి వెబ్‌సైట్లో అందుబాటులో ఉంటాయని వెల్లడించింది. కాగా ఏడాదికి 2సార్లు టెట్ నిర్వహిస్తామని గతంలో ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణలో ఏడాదిలో రెండుసార్లు (జూన్, డిసెంబర్) టెట్ పరీక్ష నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని గతేడాది జులైలో ప్రకటించింది. ఇందులో భాగంగా గతేడాది డిసెంబర్‌లో టెట్ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది జనవరిలో పరీక్షలు నిర్వహించింది. జనవరిలో జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షకు 2.75లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. దాదాపు 2లక్షల మందికి పైగా హాజరయ్యారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com