TG : సాయంత్రం 5 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ.. సీఎం

TG : సాయంత్రం 5 గంటలకు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ..  సీఎం
X

తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సాయంత్రం 5 గంటలకు సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్‌రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, రాష్ట్ర మంత్రులు, కాంగ్రెస్‌ పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్‌ కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల మహిళలు పాల్గొంటారు.

రాష్ట్ర నలుమూలల నుంచి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో మహిళలు హాజరయ్యేందుకు ప్రభుత్వం అన్నిరకాల ఏర్పాట్లు చేసింది. విగ్రహావిష్కరణ కార్యక్రమ ఏర్పాట్లను సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలించారు. తెలంగాణ తల్లి విగ్రహ రూపశిల్పి రమణారెడ్డిని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్‌గౌడ్‌ సన్మానించారు. పోరాట స్ఫూర్తిని చాటేలా విగ్రహాన్ని తీర్చిదిద్దారని ఆయన్ను కొనియాడారు.

Tags

Next Story