TG : తెలంగాణలో ఫిట్‌నెస్ లేని బస్సులు నడిపితే కేసులు

TG : తెలంగాణలో ఫిట్‌నెస్ లేని బస్సులు నడిపితే కేసులు
X

పాఠశాలలు, కళాశాలలు నడిపే బస్సులకు ఫిట్ నెస్ పరీక్షలు చేపడుతున్నామని. అసెంబ్లీలో ప్రకటించారు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్. 15 సంవత్సరాలు దాటిన బస్సులను స్క్రాప్ కింద నిషేధిస్తున్నామని మంత్రి పాన్నం ప్రభాకర్ చెప్పారు. బుధవారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో పొన్నం వివరణ ఇచ్చారు.

కాంగ్రెస్ సభ్యులు మక్కాన్ సింగ్ ఠాకూర్, ప్రభుత్వ విప్ అది శ్రీనివాస్, వాకిటి శ్రీహరి పాఠశాలలు, కళాశాలల బస్సులకు సంబంధించి అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు మంత్రి. రాష్ట్రంలో 24 వేల స్కూల్ బస్సులు ఉన్నాయని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

Tags

Next Story