TG : తెలంగాణలో ఆసక్తికరంగా ఎమ్మెల్సీ రేసు

TG : తెలంగాణలో ఆసక్తికరంగా ఎమ్మెల్సీ రేసు
X

రాష్ట్రంలో వచ్చే ఏడాది మూడు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 2025 మార్చి 29తో ప్రస్తుత ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, రఘోత్తంరెడ్డి, నర్సిరెడ్డిల పదవీ కాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో ఓటరు జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది.

వచ్చే ఏడాది జరగనున్న 3 శాసన మండలి స్థానాల ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల కమీషన్ ఓటర్ల జాబితా తయారీ షెడ్యూలు ఖరారు చేసింది. సెప్టెంబర్ 9 నుంచి ఓటర్ల నమోదు చేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి వెల్లడించారు. వచ్చే ఏడాది మార్చి 29న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్రెడ్డి, టీచర్ ఎమ్మెల్సీలు రఘోత్తం రెడ్డి, అలుగుబెల్లి నర్సిరెడ్డి పదవీకాలం ముగియనుంది.

మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్ పట్టభద్రుల, టీచర్ నియోజక వర్గాలతో పాటు వరంగల్, ఖమ్మం, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజక వర్గం ఓటర్ల జాబితా తయారీకి సెప్టెంబర్ 30న నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు సీఈవో తెలిపారు. నవంబర్ 6 వరకు ఓటర్ల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అదే నెల 23న ముసా దా ప్రకటిస్తారు. డిసెంబర్ 25 వరకు అభ్యంతరాలను స్వీకరించి, 30వ తేదీన తుది జాబితా ప్రకటించనున్నట్లు సీఈవో తెలిపారు. గతంలోని ఓటరు జాబితాలో పేరు ఉన్నప్పటికీ, మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సుదర్శన్ రెడ్డి తెలిపారు.

Tags

Next Story