TG Weather Alert : తెలంగాణలో మరో మూడు రోజులు వర్ష సూచన

TG Weather Alert : తెలంగాణలో మరో మూడు రోజులు వర్ష సూచన
X

తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. మరో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షా లు కురుస్తాయని హెచ్చరించింది. పలు జిల్లాల్లో చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడే అవకాశాలున్నాయని పేర్కొంది. మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. నైరుతి బంగాళాఖాతం, దక్షిణాంధ్ర తీరంలో ఉన్న ఉపరితల ఆవర్తనం సగటు సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 3.1 కిలోమీటర్ల వరకు విస్తరించి ఉన్న ట్లు తెలిపింది. దీని ప్రభావంతో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్జ్ జారీ చేసింది. నవంబర్ 4 వరకు రాష్ట్రంలో వానలు కొనసాగేందుకు అవకాశాలున్నాయని వివరించింది. కాగా.. గురువారం ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్, హైదరాబాద్ తో పాటు మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి.

Tags

Next Story