Viral : తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా తెలుగుతల్లి ఫ్లైఓవర్

X
By - Manikanta |30 Sept 2025 6:30 PM IST
హైదరాబాద్ నగరవాసులకు సుపరిచితమైన తెలుగుతల్లి ఫ్లైఓవర్ పేరును రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఈ ఫ్లైఓవర్‌కు ఇకపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా నామకరణం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర సచివాలయం ప్రాంతంలో ఉన్న ఈ ఫ్లై ఓవర్ వద్ద ఉన్న బోర్డులపై తెలంగాణ తల్లి ఫ్లైఓవర్‌గా పేరును అధికారికంగా మార్చినట్లుగా పేర్కొన్నారు.
సచివాలయం వద్ద కీలకమైన మార్పు రాష్ట్ర రాజధాని నడిబొడ్డున, ముఖ్యంగా నూతనంగా నిర్మించిన సచివాలయానికి అతి సమీపంలో ఉండే ఈ ఫ్లైఓవర్ ప్రాంతం ఎల్లప్పుడూ రద్దీగా ఉంటుంది. ఈ కీలక కూడలిలో తెలుగుతల్లి పేరు స్థానంలో తెలంగాణ తల్లి పేరును పెట్టడం అనేది రాష్ట్ర సాంస్కృతిక గుర్తింపు, ఆత్మగౌరవాన్ని ప్రతిబింబిస్తుందని అధికార వర్గాలు చెబుతున్నాయి.
Tags
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com