TG : తెలంగాణలో45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ

TG : తెలంగాణలో45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు.. రెడ్ అలర్ట్ జారీ
X

తెలంగాణలో ఎండలు తీవ్రమయ్యాయి. నిన్న నిజామాబాద్, ఆదిలాబాద్ నిర్మల్, మంచిర్యాలలో 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ లోని సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్లకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు పలు జిల్లాల్లో 3 రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు రాష్ట్రంలో రేపటి నుంచి వర్షాలు మొదలవుతాయని తెలంగాణ వెదర్‌మ్యాన్ అంచనా వేశారు. రేపటితో వడగాలులు ముగుస్తాయని పేర్కొన్నారు. ఏప్రిల్ 25 నుంచి 27 వరకు భారీ వర్షాలు, ఈదురుగాలులు వీస్తాయని, ముఖ్యంగా 26న వీటి ప్రభావం ఎక్కువగా ఉంటుందన్నారు. హైదరాబాద్ నగరంలోనూ వర్షాలు కురుస్తాయని వివరించారు.

Tags

Next Story