Temple : ఎస్సారెస్పీ బ్యాక్ వాటర్ లో ఆలయ శిఖరాలు

ఆర్మూర్ నియోజకవర్గంలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ లో గల ఉమ్మడి నందిపేట్ మండల శివారులో గల ఉమ్మెడ ఉమామహేశ్వర ఆలయం తేలి దర్శనమిస్తుంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండుకోవడంతో ఉమ్మెడ శివారులోని ఉమామహేశ్వర ఆలయం శ్రీరామ్ సాగర్ బ్యాక్ వాటర్ లో పూర్తిగా మునిగిపోయింది. భారీ వర్షాల నేపథ్యంలో శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద గేట్లను పైకి లేపి వరద నీటిని కిందికి వదలడంతో వరద నీటి ప్రవాహం తగ్గుముఖం పట్టింది. దీంతో ఉమ్మెడ శివారులో గల ఉమామహేశ్వర ఆలయ శిఖరాలు బయటకు తేలి దర్శనమిస్తున్నాయి. ఉమ్మెడ శివారు ప్రాంతాల్లోని ప్రజలందరూ శరన్నవరాత్రులు ముగియడంతో దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరివాహకం ప్రాంతానికి వెళ్లి గోదావరి గంగా స్నానాలను ఆచరించారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో ఇదివరకు మునిగిన ఉమ్మెడి ఉమామహేశ్వర ఆలయ శిఖరాలను శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు పరివాహక ప్రాంతాలకు గంగా స్నానాలకు వెళ్లిన భక్తులు దర్శించుకుంటున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com