Rs.10 Coins are Legal : రూ.పది నాణేలు చెల్లుతాయ్ : ధారాసింగ్ నాయక్

రూ.10 నాణేలు చట్టబద్ధమైనవేనని, వీటిని రోజూవారీ లావాదేవీలకు ఉపయోగించవచ్చని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక సెంట్రల్ బ్యాక్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ ధారాసింగ్ నాయక్ తెలిపారు. వీటి చలామణిని వ్యాపార లావాదేవీలకు ఉపయోగించాలనే ఆర్బీఐ ఉత్తర్వుల మేరకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. హైదరాబాద్ కోఠిలోని బ్యాంక్ శాఖ వద్ద రూ.10 నాణేల చలామణిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. తమ ఖాతాదారులకు ఈ నాణేలు వినియోగించాలని సూచిస్తున్నామన్నారు. ఇప్పటికే ఆర్టీసీ బస్సుల్లోనూ ఇవి చెల్లుబాటవుతున్నాయని తెలిపారు. ప్రజల్లో రూ.10 నాణేలపై ఉన్న అపోహలను తొలిగించేందుకే ఈ మేళాను నిర్వహించినట్లు పేర్కొన్నారు. ఎలాంటి అనుమానాలకు తావు లేకుండా ఈ నాణేలను లావాదేవీలకు చలామణి చేయవచ్చని, రూ.10 నోటు కంటే నాణేం ఎక్కువ కాలం మన్నికతో ఉంటుందని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఖాతాదారులకు ఈ నాణేలను అందజేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com