Mallareddy College : మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత

Mallareddy College : మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్తత
X

మల్లారెడ్డి కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. గర్ల్స్‌ హాస్టల్‌లో జరిగిన ఘటనతో విద్యార్థులు భయందోళనలో ఉన్నారు. హాస్టల్‌ వద్దకు చేరుకున్న విద్యార్థి సంఘాలు, పేరెంట్స్‌ కాలేజీ యాజమాన్యంతో గొడవకు దిగాయి. లక్షల రూపాయల ఫీజు కట్టి హాస్టల్‌లో చేర్పిస్తే.. తమ పిల్లలకు రక్షణ లేకుండా పోయిందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకుందామని గర్ల్స్‌ హాస్టల్‌ లోపలికి NSUI విద్యార్థి సంఘం నేతలు వెళ్లారు. దాంతో అనుమతి లేకుండా లోపలికి ఎలా వెళ్తారంటూ సిబ్బంది అడ్డుకోవడంతో విద్యార్థి సంఘాల నేతలు వారితో గొడవపడ్డారు.

Tags

Next Story