TG : కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద టెన్షన్ టెన్షన్.. పోలీసుల కేసు నమోదు

సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశాడు. రేవంత్ ఎక్కడెక్కడ ఏం ఏం పనులు చేశాడో అంతా తనకు తెలసని.. అవన్నీ బయటపెడతానని అన్నారు. రేవంత్ 16మందితో తిరిగిటనట్లు సంచలన ఆరోపనలు చేశారు. మిస్ వరల్డ్ అమ్మాయిల ఫోన్లు కూడా ట్యాప్ చేశారని ఆరోపించారు. తనవి ఆరోపణలు కాదని.. సత్యాలని చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఫైర్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా కౌశిక్ రెడ్డిపై పలు స్టేషన్లలో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రాజేంద్రనగర్ పోలీసులు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పై కేసు నమోదు చేశారు.
మరోవైపు ఎన్ఎస్‌యూఐ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చారు. సీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా వివిధ మార్గాల్లో ఎన్ఎస్‌యూఐ నేతలు కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకుంటున్నారు. దీంతో టెన్షన్ వాతావరణ నెలకొంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com