TG : ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఉత్కంఠ

TG : ఎమ్మెల్యేల ఫిరాయింపుపై ఉత్కంఠ
X

ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు డివిజన్ బెంచ్ నిరాకరించింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని కోరుతూ అసెంబ్లీ సెక్రటరీ హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన ధర్మాసనం హైకోర్టు డివిజన్ బెంచ్ నిరాకరించింది. ఈ నెల 24న ఎమ్మెల్యేల అనర్హత కేసుకు సంబంధించి వాదనలు వింటామని తెలిపింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి పిటిషన్లు దాఖలు చేశారు.

అన్ని పిటిషన్లపై హైకోర్టు ధర్మాసనం ముందు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు నాలుగు వారాల్లో ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలని అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. ఒకవేళ అనర్హతపై ఎలాంటి నిర్ణయం తీసుకోని పక్షంలో సుమోటో కేసుగా విచారిస్తామని సింగిల్ బెంచ్ స్పష్టం చేసింది. ఈ తీర్పుపై అసెంబ్లీ కార్యదర్శి హైకోర్టు డివిజన్ బెంచ్‌లో అప్పీల్ చేశారు.

Tags

Next Story