HYDRA : హైడ్రా మూసీ పరీవాహ సర్వేలో ఉద్రిక్తత.. స్థానికుల తిరుగుబాటు
మూసీ నది పరివాహక ప్రాంతాల్లో పోలీసు బందోబస్తు మధ్య అధికారుల సర్వే కొనసాగుతోంది. హైదరాబాద్ జిల్లా పరిధిలో 16 బృందాలు సర్వే చేస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో నాలుగు, మేడ్చల్ మల్కాజిగిరి పరిధిలో 5 బృందాలతో సర్వే జరుగుతోంది. నదీ గర్భంలోని నిర్వాసితుల నిర్మాణాల వివరాలను రెవెన్యూ అధికారులు అడిగి తెలుసుకుంటున్నారు. మూసీ నదిలో ఉన్న బఫర్ జోన్‌లోని నిర్మాణాలకు మార్క్ చేస్తున్నారు. చాదర్‌ఘాట్, మూసానగర్, శంకర్‌నగర్ లోని మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు సర్వే చేపట్టారు. హిమాయత్‌నగర్, గోల్కొండ పరిధిలోని ఇబ్రహీంబాగ్, లంగర్‌హౌస్ డిఫెన్స్ కాలనీలో అధికారులు సర్వే చేపట్టారు.
కొత్త పేట, సత్యానగర్, చైతన్య పురి, ఫణిగిరి కాలనీ, ఇందిరా నగర్ , గణేష్ పురి కాలనీలలో ఈ రోజు ఉప్పల్ రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించడం ఆ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. ఆందోళనకు దిగండతో అధికారులు వెనుదిరిగారు. నిర్మాణాలకి అనుమతి ఇచ్చి, ఇప్పుడు సర్వే చేసి కూల్చుతామంటే ఊరుకోబోమంటున్నారు. తమ ఇండ్ల జోలికి ఎవరు రావద్దని ఆందోళన వ్యక్తం చేశారు. 30 ఏళ్ళ నుంచి వెంచర్లు వేస్తుంటే అధికారులు ఏం చేశారంటున్నారు. ఇప్పుడు వెళ్ళగొడతామంటే ఊరుకునేది లేదన్నారు బాధితులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com