TG : సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత

TG : సిమెంట్ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణలో ఉద్రిక్తత
X

తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నగూడెంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిమెంట్‌ కంపెనీ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం వద్ద గ్రామస్థులు ఆందోళనకు దిగారు. సిమెంట్‌ కంపెనీకి వ్యతిరేకంగా ప్లకార్డులతో గ్రామస్థులు, అఖిలపక్ష నేతలు నిరసన తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ ప్రాంగణంలో నేలపై కూర్చుని గో బ్యాక్‌ అంటూ నినాదాలు చేశారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దాంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు పెద్దసంఖ్యలో మోహరించారు.

Tags

Next Story