TG : గుడి నిందితుడు బసచేసిన హోటల్‌పై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం

TG : గుడి నిందితుడు బసచేసిన హోటల్‌పై దాడి.. పరిస్థితి ఉద్రిక్తం
X

సికింద్రాబాద్‌ బంద్ లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. మోండా మార్కెట్ ముత్యాలమ్మ గుడిలో జరిగిన ఘటన తర్వాత పరిణామాలతో ఉద్రిక్త కొనసాగుతోంది. హిందూ సంఘాల బంద్ పిలుపుతో పరిస్థితులు సెన్సిటివ్ గా మారాయి. పెద్ద ఎత్తున స్థానికులు, హిందూ వాదులు, స్వామీజీలు, ట్రాన్స్ జెండర్లు సికింద్రాబాద్ కు చేరుకున్నారు.

పూజించే అమ్మవారి పట్ల అమానుషంగా ప్రవర్తించిన సలీం టకుర్ బస చేసిన హోటల్ పై రాళ్లు రువ్వారు. అక్కడ భారీస్థాయిలో బందోబస్తు ఏర్పాటుచేశారు. ఇదే సమయంలో ప్రధాన నిందితుడు సలీం బస చేసిన హోటల్‌పై దాడి జరిగింది. మత విద్వేషాలు రెచ్చగొట్టేందుకు వచ్చిన వారిని తరిమి కొడతామని, బుల్డోజర్‌లు దింపుతామని హెచ్చరించారు. హోటల్‌పై దాడితో సికింద్రాబాద్‌లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది.

అక్కడే ఉన్న ప్రార్థనా మందిరంలోకి దూసుకెళ్లేందుకు కొందరు ప్రయత్నించారు. ఐతే.. వారిని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. జైశ్రీరాం నినాదాలతో సికింద్రాబాద్ మోండామార్కెట్ దద్దరిల్లుతోంది.

Tags

Next Story