Hydra : హైడ్రా మూసీ సర్వేలో ఉద్రిక్తత.. ఇండ్లు వదిలేదంటున్న నిర్వాసితులు

Hydra : హైడ్రా మూసీ సర్వేలో ఉద్రిక్తత.. ఇండ్లు వదిలేదంటున్న నిర్వాసితులు
X

హైదరాబాద్ లో హైడ్రా ఆపరేషన్ మూసీపై తీవ్రంగా మండిపడుతున్నారు పరివాహక ప్రాంత ప్రజలు. తాము కట్టుకున్న ఇళ్ళను ఎలా కూల్చేస్తారంటూ ఆందోళనకు దిగుతున్నారు. ఈ క్రమంలోనే మూసీ పరివాహక ప్రాంతమైన అంబర్‌పేటలో బాధితులు తమ ఇళ్ళను కూల్చ వద్దు అంటూ రోడ్డెక్కారు. రాత్రి అంతా రోడ్డుపై కూర్చుని నిరసన తెలిపారు. రాత్రికి రాత్రి హైడ్రా అధికారులు తమ ఇళ్ళ ను కూల్చేస్తారన్న భయంతో రాత్రి రోడ్డుపై బైఠాయించి నిద్ర లేని రాత్రులు గడిపారు.

మరోవైపు.. మూసీ నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. వారిని సైదాపూర్‌ మండలంలోని పిల్లి గుడిసెలు ప్రాంతంలోని డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ళకు తరలించారు. హిమాయత్‌నగర్‌ కు చెందిన కుటుంబాలు తమ సామానులతో అక్కడికి వెళ్ళాయి. అయితే అక్కడ కేవలం ఆరుగురికే డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళు కేటాయించారు. మిగిలిన వారు పిల్లాపాపలతో రోడ్డుపైనే ఉండిపోయారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి అంటూ ఆందోళనకు దిగారు. రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం, హైడ్రా చర్యలపై పాతబస్తీ వాసులు తీవ్రంగా ఫైరవుతున్నారు.

Tags

Next Story