TG ESET Results : టీజీ ఈసెట్లో 93.87%క్వాలిఫై

TG ESET Results : టీజీ ఈసెట్లో 93.87%క్వాలిఫై
X

టీజీ ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కాలేజీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకిష్టారెడ్డి రిజల్ట్స్ రిలీజ్ చేశారు. ఈనెల 12న నిర్వహించిన ఎగ్జామ్లో మొత్తం 18,998 మంది విద్యార్థులు హాజరుకాగా.. 93.87% క్వాలిఫై అయ్యారు. మెటలార్జికల్ ఇంజినీరింగ్, బీఎస్సీ మ్యాథ్స్, ఫార్మసీలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. బీఎస్సీ మ్యాథ్స్ సంతోష్ కుమార్, కెమికల్ ఇంజి నీరింగ్లో లెంక తేజ సాయి, సివిల్ ఇంజినీ రింగ్లో గోల్కొండ నిఖిల్ కౌశిక్, కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్లో శ్రీకాంత్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ కట్లే రేవతి, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో కాసుల శ్రావణి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్సుట్రు మెంటేషన్ ఇంజినీరింగ్లో రాపర్తి చందన, మెకానికల్ ఇంజినీరింగ్ పోతుగంటి కార్తిక్, మెటలర్జికల్ ఇంజినీరింగ్లో తోట సు బ్రహ్మణ్యం, మైనింగ్ ఇంజినీరింగ్ కుర్మా అక్షయ, ఫార్మసీలో ఐలి చందన మొదటి ర్యాంకు సాధించారు.

Tags

Next Story