Asaduddin Owaisi : థ్యాంక్స్ మాధవీలత.. అసద్ హాట్ కామెంట్
హైదరాబాద్ లో గెలుపు తర్వాత మీడియాతో మాట్లాడారు మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ. ఎన్నికల ముందు 400 పార్ చెప్పిన ప్రధాని మోదీ 300 దాటలేదని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. మజ్లిస్ ప్రధాన కార్యాలయమైన దారుస్సలాంలో ఒవైసీ విజయోత్సవాలను జరుపుకున్నారు.
గతంలో కేసీఆర్ తో ఉన్న సంబంధాలు కొనసాగిస్తామని, ఆయనను గౌరవిస్తానని ఒవైసీ చెప్పారు. ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఉత్తర ప్రదేశ్లో పీడియంతో మిత్ర పక్షాన్ని కొనసాగిస్తామన్నారు. బీజేపీ దేశ యువతను మోసం చేసిందని ఆరోపించారు. ఔరంగాబాద్ మజ్లిస్ ఎంపీ ఇంతియాజ్ జలీల్ ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయారనీ.. అక్టోబర్లో మహారాష్ట్రలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దింపుతామని ఆయన భరోసా ఇచ్చారు.
హైదరాబాద్ ప్రజలు మజ్లిస్ పార్టీతో అమిత ప్రేమను చూపించి ఐదో సారి భారీ మెజారిటీతో విజయాన్ని ప్రసాదించారన్నారు అసద్. తనను గెలిపించిన హైదరాబాద్ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే చారిత్రక విజయానికి ప్రధాన కారకులైన మహిళలకు ఒవైసీ కృతజ్ఞతలు చెప్పారు. తన మెజారిటీ పెరిగిందని.. బీజేపీ అభ్యర్థి మాధవీలతకు థ్యాంక్స్ చెప్పారు అసద్.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com