Secunderabad : కారులో ఆవులను ఎత్తుకెళ్లిన దుండగులు

Secunderabad : కారులో ఆవులను ఎత్తుకెళ్లిన దుండగులు
X

సికింద్రాబాద్‌లో ఓ ముఠా ఆవులను అపహరిస్తుంది. ఇన్నోవా కారులో వచ్చి ఆవులను ఎత్తుకెళ్లారు. మోండా మార్కెట్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని బండిమెట్‌ ప్రాంతంలో ఆవుల వద్దకు వచ్చిన దుండగులు వాటికి మత్తు ఇంజక్షన్‌ ఇచ్చారు. ఆ తర్వాత ఇన్నోవా కారులో వాటిని వేసుకొని పరారయ్యారు. యువకులు ఆవులను తీసుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. మారేడుపల్లిలో కూడా నిన్న రాత్రి ఇలాంటి ఘటనే చోటు చేసుకోవడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆవులను ఎక్కడికి తీసుకెళ్తున్నారు? దొంగలించింది ఎవరు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story