ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిపై కేసు

ముత్తిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిపై కేసు
X
జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిపై కేసు నమోదైంది.

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుమార్తె తుల్జా భవానీరెడ్డిపై కేసు నమోదైంది. రాజుభాయ్ అనే వ్యక్తి ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.తన భూమిలోని ఫెన్సింగ్‌ను తుల్జా భవానీరెడ్డి కూల్చివేసినట్లు పేర్కొన్నారు. రాజుభాయ్ ఫిర్యాదుతో తుల్జాభవానీరెడ్డితో పాటు మరికొందరిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తుల్జా భవానీరెడ్డిపై ఆమె తండ్రి ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డే రాజుభాయ్‌తో కేసుపెట్టించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి వ్యతిరేకంగా ఆయన కుమార్తె తుల్జా భవానీరెడ్డి గళం వినిపిస్తున్నారు. తన తండ్రి కబ్జాలకు పాల్పడ్డారని ఆరోపించారు. చేర్యాలలోని పెద్దచెరువు మత్తడి స్థలాన్ని కబ్జా చేసి అక్రమంగా తన పేరుపై రిజిస్ట్రేషన్ చేశారని తుల్జా భవానీరెడ్డి తెలిపారు. తన పేరుపై ఉన్న 1270గజాల స్థలాన్ని మున్సిపాలిటీకి అప్పగిస్తున్నట్లు ప్రకటించారు. ఆ స్థలంలో వేసిన ఫెన్సింగ్‌ను తొలగించారు. అయితే దానితో పాటు తన భూమిలోని ఫెన్సింగ్‌నూ తుల్జా భవానీరెడ్డి కూల్చివేశారని రాజుభాయ్ ఫిర్యాదు చేయడంతో ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Tags

Next Story