TS : రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. కాసేపటికే మృతి

TS : రన్నింగ్‌ బస్సులో డ్రైవర్‌కు గుండెపోటు.. కాసేపటికే మృతి

ఖమ్మం జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటుతో ఆర్టీసీ డ్రైవర్‌ కన్నుమూశాడు. వివరాల్లోకి వెళితే ఖమ్మం జిల్లా వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావు సత్తుపల్లి ఆర్టీసీ డిపో పరిధిలోని అద్దె బస్సుకు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి 15వ తేదీన సత్తుపల్లి నుండి ఖమ్మం వైపు 50 మంది ప్రయాణికులతో బస్సు వెళ్తుండగా శ్రీనివాసరావుకు గుండెనొప్పి వచ్చింది.

దీంతో గుండెలో నొప్పిని భరిస్తూనే బస్సును కల్లూరు ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఆపాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు ఆయన్ను ఆస్పత్రిలో చేర్చారు.అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసరావు కన్నుమూశారు. గుండెపోటుతోనే ఆయన కన్నుమూసినట్లు వైద్యులు వెల్లడించారు. ప్రయాణికులకు ఎటువంటి ప్రమాదం కలిగించకుండా గుండెపోటుకు గురైనప్పటికీ ఆసుపత్రి వద్ద బస్సును సురక్షితంగా నిలిపడంతో పెను ప్రమాదం తప్పింది. శ్రీనివాస రావుకు విధుల పట్ల ఉన్న నిబద్ధతను ప్రశంసిస్తూనే ప్రయాణికులు తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

Tags

Next Story