Minister Seethakka : కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావొచ్చు : మంత్రి సీతక్క

సిస్టర్ స్ట్రోక్ తో కేటీఆర్ కు చిన్న మెదడు చితికిపోయిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. ఇవాళ ఆమె సచి వాలయంలో మీడియాతో మాట్లాడారు. కవిత చెప్పిన దయ్యం కేటీఆరే కావొచ్చని అనుమానం వ్యక్తం చేశారు. కేటీఆర్ ప్రెస్ మీట్ లో చేసిన ఆరోపణలకు ఆమె కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరంలో కమీషన్ తీసుకున్నప్పుడు లేని భయం.. కమీషన్ ముందుకు రావడానికి ఎందుకు అని ప్రశ్నించారు. గోబెల్స్ ప్రచారంలో నిన్ను మించిన వారు లేరన్నారు. ఆయనకు గోబెల్స్ అవార్డు ఇవ్వాలని ఎద్దేవా చేశారు. అబద్దాల పు నాదులమీదే బీఆర్ఎస్ నడుస్తోందని విమర్శిం చారు. మోదీ ప్రశంసల కోసమే కేటీఆర్ ఈడీ గురించి మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఈ కేసు బుక్ చేశారని చెప్పారు. అబద్దాన్ని నిజం చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్రను కేటీఆర్ మర్చిపోయారని అన్నారు. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి పై తప్పుడు విమర్శలు మానుకో వాలని హితవు పలికారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన పత్రికకు సహాయం చేస్తే తప్పా అని ప్రశ్నించారు. గులాబీ కూలీల రూపంలో దో చుకున్న డబ్బు ఎక్కడిదో కేటీఆర్ సమాధానం చెప్పాలని సీతక్క డిమాండ్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com