Kakatiya Royals : బ్రిటన్ నుంచి కోహినూర్ వజ్రాన్ని తెప్పించాలి : కాకతీయ రాజవంశీయులు

కాకతీయుల సంపదైన కోహినూర్ వజ్రాన్ని ఆంగ్లేయులు బ్రిటన్ కు తీసుకెళ్లారనీ.. కోహినూర్ వజ్రం నాటి కాకతీయులు.. నేటి తెలంగాణ ప్రజల వారసత్వ సంపద అని దాన్ని తప్పనిసరిగా బ్రిటన్ నుంచి తెప్పించాలని దేశ ప్రధాని నరేంద్రమోడిని కోరినట్లు కాకతీయుల రాజవంశయులు 22వ మహారాజు కమల్ చంద్ర భంజ్ దేవ్ తెలిపారు. అలాగే త్వరలో వరంగల్ నగరంలోని మామునూరులో నిర్మించబోతున్న విమాన శ్రయానికి రాణిరుద్రమదేవి పేరుపెట్టాలని గతంలోనే ప్రధాని మోడిని కోరినట్లు ఆయన వెల్లడించారు. మంగళవారం కమల్ చంద్రభంజ్ దేవ్ వరంగల్ పశ్చిమ, తూర్పు మాజీ ఎమ్మెల్యేలు దాస్యం వినయ్ భాస్కర్, నన్నపునేని నరేందర్ తో కలిసి వరంగల్ నగరంలో సందడి చేశారు.
కాకతీయుల సంపద అయిన ఖిలావరంగల్ కోటను, శ్రీ భద్రకాళీ అమ్మవారిని, వేయిస్తంభాల దేవాలయాన్ని దర్శించు కొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వరంగల్ కోటలోని స్వయంభూ శంభులింగేశ్వర ఆలయంలోని శివునికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. వేయిస్తం భాల దేవాల యంలోని రుద్రేశ్వరుడికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చ నలు నిర్వహించారు. ఆలయ సిబ్బంది కమల్ చంద్ర భంజ్ దేవ్ కి పూర్ణకుంభ స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక ఆశీర్వ చనాలు అం దించారు. అనం తరం ఆయన పోచమ్మ మైదాన్ సెంటర్లోని మహారాణి రుద్రమ దేవి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం హనుమ కొండ రెడ్డిపురంలోని టార్చ్ సంస్థ వ్యవస్థాపకులు అరవింద్ ఆర్య ఇంటిని సందర్శించారు. మీట్ అండ్ గ్రీట్ కార్య క్రమంలో నక్కల గుట్టలోని హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్లో..... ఓరుగల్లు నగర ప్రజలతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను ప్రతి ఒక్కరు కాపాడుకోవాలని కమల్ చంద్ర భంజ్ దేవ్ కోరారు. అసలు ప్రపంచానికి విజ్ఞానాన్ని, సాంప్రదాయాలను, సంస్కృతిని పరిచయం చేసిన మహోన్నత దేశం భారతదేశం అని ఆయన అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com