TG : కాంగ్రెస్ ప్రభుత్వంపై విషపు రాతల పేపర్‌ను బ్యాన్ చేయాలి : ఎంపీ చామల
పండగ వేళ ప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్న ఓ తెలుగు న్యూస్ డెయిలీ న్యూస్ పేపర్ పై చర్యలు తీసుకోవాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్స్ వేదికగా డీజీపీకి ట్వీట్ చేశారు. అందరికీ దీపావళి శుభాకాంక్షలు అంటూ.. పండుగ రోజు కూడా ప్రభుత్వంపై ఆ పత్రిక విష ప్రచారం చేస్తోందంటూ ఓ వీడియోలో ఆరోపించారు. ఇందులో ల్యాండ్ పూలింగ్ పేరుతో తన పేరు ప్రస్తావించకుండా ఇటీవల విదేశాలకు వెళ్లి వచ్చిన ఎంపీ అని ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. అలాగే ఒక పేపర్ నడుపుతున్నప్పుడు ప్రామాణికాలు పాటించాలని సూచించారు.
దీనిపై ఎంక్వయిరీ చేయాలని సీఎం రేవంత్రెడ్డి, డీజీపీలను కోరారు. ప్రజలకు చిత్తశుద్ధి ఉన్న పాలనను అందించాలని ముఖ్యమంత్రి ఫోర్త్ సిటీని తీసుకొచ్చి హైదరాబాద్ అభివృద్ధి చేయాలని సంకల్పించారని తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు గత పదేళ్లలో చేయని పాలనను కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే చేస్తు న్నందుకు ఓర్వలేక ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఎంక్వెరీ చేసి, ప్రజలకు నిజనిజాలు తెలియజే యాల్సిన అవసరం ఉందని, ఇది అవాస్తవం అయితే ఈ పత్రిక పై చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై త్వరలో రాత పూర్వకంగా కూడా ఫిర్యాదు చేస్తానని చామల తెలిపారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com