CM Revanth Reddy : ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్

CM Revanth Reddy : ప్రధాని పెద్దన్న లాంటివారే.. ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా: రేవంత్
X

పదేపదే తాను ఢిల్లీకి వెళ్తున్నానంటూ బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ‘అసెంబ్లీ సాక్షిగా చెబుతున్నా.. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికైనా ప్రధాని పెద్దన్న లాంటివారే. కేంద్రం తీసుకొనే నిర్ణయాలు రాష్ట్రాలపై ప్రభావం చూపుతాయి. పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. ఇందులో రాజకీయం ఏముంది? ఎన్ని సార్లైనా ఢిల్లీకి వెళ్తా. ప్రతి కేంద్రమంత్రి వద్దకు వెళ్లి నిధులు తీసుకొస్తున్నా’ అని తెలిపారు. మరోవైపు TGPSCని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేసిందని సీఎం రేవంత్ మండిపడ్డారు. ‘డిసెంబర్ 3, 2023 నుంచి ఇప్పటివరకు 57,924 ప్రభుత్వ ఉద్యోగాలిచ్చాం. ఇది దేశ చరిత్రలోనే రికార్డు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఏ రాష్ట్రమూ ఈ ఘనత సాధించలేదు. 2023 జులై నుంచి సెప్టెంబర్ వరకు నిరుద్యోగ రేటు 22.9% ఉంటే 2024 జులై నుంచి సెప్టెంబర్ వరకు 18.1 శాతానికి తగ్గింది. ఇవన్నీ మా కష్టానికి ప్రతిఫలం’ అని అసెంబ్లీలో చెప్పారు

Tags

Next Story