Weather Alert : మండిపోతున్న ఎండలు ... మార్చి 1 నుంచి జాగ్రత్త

Weather Alert : మండిపోతున్న ఎండలు ... మార్చి 1 నుంచి జాగ్రత్త
X

ఫిబ్రవరిలోనే ఎండలు మండిపోతున్నాయి. మార్చి 1 నుంచి తెలంగాణలో ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా 35.3 డిగ్రీల నుంచి 38.2 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆసిఫాబాద్ పెంచికల్‌పేటలో అత్యధికంగా 38.2 డిగ్రీలు, జగిత్యాల జిల్లా బీర్‌పూర్‌లో 38.1, నిర్మల్ జిల్లా గింగాపూర్‌లో 38.1, నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దముద్నూర్‌లో 38 డిగ్రీల చొప్పున టెంపరేచర్ రికార్డయింది.

తూర్పు, ఆగ్నేయ గాలుల వలన పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ప్రతి సంవత్సరం ఈ సమయంలో నమోదయ్యే సాధారణ ఉష్ణోగ్రతల కంటే మూడు నాలుగు డిగ్రీల మేర ఎక్కువగా ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి.

Tags

Next Story