Hyderabad: కరుణాకర్‌రెడ్డి కిడ్నాప్ కథ విషాదాంతం

రంగారెడ్డి జిల్లాలో సంచలనం సృష్టించిన కరుణాకర్‌రెడ్డి కిడ్నాప్ కథ విషాదాంతంగా మారింది. కరుణాకర్‌రెడ్డి హైదరాబాద్‌లో శవమై తేలాడు. అర్ధరాత్రి కొత్తూరులో కిడ్నాప్ చేసిన నలుగురు దుండగులు గచ్చిబౌలిలో దారుణంగా హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని గచ్చిబౌలిలో పడేసి పారిపోయారు. కొత్తూరు MPP మధుసూదన్‌రెడ్డి ఈ హత్య చేయించారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. గతంలో MPP మధుసూదన్‌రెడ్డి అనుచరుడిగా కరుణాకర్‌రెడ్డి ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా MPPకి, కరుణాకర్‌రెడ్డికి మధ్య విభేదాలు ఉన్నాయని గ్రామస్తులు అంటున్నారు.
తీగాపూర్ శివారులో కరుణాకర్‌రెడ్డి కారును నలుగురు గుర్తు తెలియని వ్యక్తులు అడ్డగించారు. ఆ తర్వాత కారు అద్దాలు ధ్వంసం చేసి కరుణాకర్‌రెడ్డిపై దాడి చేశారు. అనంతరం మరో కారులో బలవంతంగా ఎక్కించి అపహరించారు. ఈ క్రమంలో కరుణాకర్ తల్లి స్వరూప ఫోన్ చేయడంతో అతని ఫోన్ స్విచ్ఛాఫ్ వచ్చింది. అనుమానంతో కరుణాకర్ ఆచూకి కోసం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కొత్తూరు ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి బామ్మర్థులపై స్వరూప అనుమానం వ్యక్తం చేశారు. మధుసూదన్‌రెడ్డి బామ్మర్థులకు, తన కొడుకు మధ్య పాతకక్షలు ఉన్నాయని తెలిపారు.
గతంలో కొత్తూరు MPP మధుసూదన్‌రెడ్డి వద్ద అనుచరుడిగా కరుణాకర్‌రెడ్డి పనిచేసారని ఎసీపీ కుషాల్కర్ తెలిపారు. భూములు కొనుగోలు, అమ్మకాల లావాదేవీలలో అక్రమాలు బయటపడతాయనే కరుణాకర్‌రెడ్డిని హత్య చేసినట్లు ACP తెలిపారు. MPP మధుసూదన్ రెడ్డ్‌తో పాటు విష్ణువర్ధన్ రెడ్డి, విక్రమ్‌రెడ్డి, అరుణ్, ఆరిఫ్‌లపై కేసు నమోదు చేసామని ACP కుషాల్కర్ వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com