TG : మెదక్, కామారెడ్డి జిల్లాలపై వరణుడి ప్రతాపం.. కొట్టుకుపోయిన రైలు మార్గం

భారీ వర్షాలతో తెలంగాణలోని మెదక్, కామారెడ్డి జిల్లాలు అతలాకుతలమయ్యాయి. వాతావరణ శాఖ ఈ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. నేషనల్ హైవే 44పై భిక్నూర్ సమీపంలో ఉన్న టోల్ ప్లాజా పూర్తిగా వరద నీటిలో మునిగిపోయింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.
కామారెడ్డిలో సికింద్రాబాద్-మన్మాడ్ రైలు మార్గం భారీ వర్షాలకు కొట్టుకుపోయింది. దీంతో ఆ మార్గంలో రైలు సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. దీనికి తోడు, కామారెడ్డి పట్టణాన్ని అనుసంధానం చేసే చిన్న రోడ్లు కూడా దెబ్బతినడంతో అనేక గ్రామాలు బయటి ప్రపంచంతో సంబంధాలు కోల్పోయాయి. రానున్న మరికొన్ని గంటల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.
కాగా వరదలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరా తీశారు. ఎల్లారెడ్డిపేటలో చోటుచేసుకున్న ఘటనపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రమాద బాధితులకు సాయం చేసేందుకు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయని, అవసరమైతే ఏ క్షణంలోనైనా సాయం అందించాలని ఆదేశించారు. అనంతరం NDRF అధికారులతో మాట్లాడిన ఆయన.. జిల్లా కలెక్టర్‌తో కలిసి సహాయక చర్యల్లో పాల్గొనాలని సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com