Metro Rail : మెట్రో రైలులో చోరీ!

Metro Rail : మెట్రో రైలులో చోరీ!
X

మెట్రోరైల్‌లో ఎక్కిన మహిళ బ్యాగులోంచి నగదుతో పాటు బంగారం మాయమయిన సంఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..హనుమకొండలోని నక్కలగుట్ట ప్రాంతానికి చెందిన శోభలత అనే వృద్ధురాలు ఈనెల 10న కంటి పరీక్షల కోసం బంజారాహిల్స్‌లోని ఎల్వీ ప్రసాద్‌ హాస్పిటల్‌కు తన సోదరితో కలిసి వచ్చింది. చికిత్స పూర్తయిత తర్వాత సొంతూరుకు వెళ్లే క్రమంలో జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 5లోని మెట్రోస్టేషన్‌ వద్దకు వచ్చి ట్రైన్‌ ఎక్కింది. ఉప్పల్‌ సమీపంలోని ఎన్‌జీఆర్‌ఐ స్టేషన్‌లో మెట్రో దిగి అక్కడి నుంచి బస్సులో హన్మకొండకు వెళ్లిపోయింది.ఇంటికి వెళ్లిన తర్వాత తన బ్యాగు చూసుకోగా రూ.12వేల నగదుతో పాటు 5గ్రాముల చెవికమ్మలు కనిపించలేదు. తాను జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం 5 మెట్రోస్టేషన్‌లో ప్రవేశించినప్పుడు బ్యాగును స్కాన్‌ చేశారని, దానిలో నగదు ఉన్న విషయాన్ని గుర్తించిన సెక్యురిటీ సిబ్బంది ఈ విషయాన్ని దొంగలకు చెప్పి ఉంటారని అనుమానం వ్యక్తం చేస్తూ బాధితురాలు హన్మకొండ నుంచి వచ్చి సోమవారం రాత్రి జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags

Next Story