Lavanya Sensational : ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు: లావణ్య సంచలన కామెంట్స్

అమ్మాయిల జీవితాలతో మస్తాన్ సాయి ఆడుకున్నాడని హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రేయసి లావణ్య ఆరోపించారు. ‘పదుల సంఖ్యలో అమ్మాయిల వీడియోలు రికార్డ్ చేశాడు. ఏ క్షణమైనా నన్ను చంపేయొచ్చు. ప్రతిక్షణం భయంతో బతుకుతున్నా. నాకేం జరిగినా మస్తాన్ సాయి కుటుంబానిదే బాధ్యత. జీవితం, నా మనిషిని కోల్పోయా. మస్తాన్ సాయి తో ఉన్నప్పుడు డ్రగ్స్ తీసుకున్నాను అంటూ కన్నీళ్లు పెట్టుకుంది లావణ్య. రాజ్ తరుణ్ కాళ్లు పట్టుకొని సారీ చెప్పాలనుకుంటున్నా. నాకు జరిగిన అన్యాయం మరొకరికి జరగొద్దు’ అని లావణ్య అన్నారు. మరోవైపు నార్సింగ్ డీఐ శ్రీనివాస్‌ను ఐజీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ సైబరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఆదేశాలు జారీచేశారు. రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసినప్పటి నుంచి లావణ్యతో తరచూ వాట్సాప్‌లో వీడియో కాల్స్ మాట్లాడుతూ.. పరిచయం పెంచుకోవడం వీరిద్దరి ఆడియో కాల్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో విచారణ జరిపిన ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com