Hyderabad : ఫీజు కట్టలేదని నిలబెట్టారు.. ప్రైవేటు స్కూల్లో షాకింగ్ ఘటన

Hyderabad : ఫీజు కట్టలేదని నిలబెట్టారు.. ప్రైవేటు స్కూల్లో షాకింగ్ ఘటన
X

ఏడువేల రూపాయల ఫీజు కట్టలేదని విద్యార్థులను బయట నిల్చోబెట్టిన ఘటన హైదరాబాద్ ఎల్బీనగర్‌లోని పల్లవి అవేర్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌లో జరిగింది. దీంతో బాధిత కుటుంబ సభ్యులు స్థానిక కార్పొరేటర్‌ను ఆశ్రయించారు. స్కూల్‌ లోపలికి విద్యార్థులను పంపించాలని స్కూల్ యాజమాన్యాన్ని కార్పొరేటర్‌ దర్పల్లి రాజశేఖర్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ నేతలు కోరారు. దానికి స్కూల్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించడంతో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఫోటోలు, వీడియోలు తీయొద్దు అని తిట్టడంతో గొడవ పెద్దదైంది. స్కూల్ సిబ్బందిపై కాంగ్రెస్ నేతలు దాడికి దిగారు. ఆఫీస్ రూమ్‌లోని ప్రింటర్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి స్కూల్ ముందు ఆందోళనకు దిగారు. 14 లక్షల రూపాయల ప్రాపర్టీ ట్యాక్స్ పెండింగ్‌లో ఉండగా... స్కూల్‌కి 9 ఏళ్ల నుంచి ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంపై మున్సిపల్ అధికారులకు కార్పొరేటర్ ఫిర్యాదు చేశారు.

Tags

Next Story