TG :దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఘటన.. షాద్నగర్ డీఐ సస్పెన్షన్

X
By - Manikanta |5 Aug 2024 5:45 PM IST
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పోలిస్ స్టేషన్ లో దళిత మహిళపై థర్డ్ డిగ్రీ ఘటనను పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. షాద్‌నగర్ డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ (డీఐ) రామిరెడ్డితోపాటు మరో ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాశ్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులను ఆదేశించారు. దీంతో ఘటనపై నివేదిక సమర్పించాలని ఏసీపీని సీపీ అవినాశ్ మహంతి ఆదేశించారు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన ఏసీపీ రంగస్వామి తన నివేదికను సీపీకి సమర్పించారు. నివేదిక ఆధారంగా బాధ్యులను గుర్తించి వారిని సస్పెండ్ చేసినట్లు సీపీ వెల్లడించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com