TG : ఆపరేషన్ కగార్ ను ఆపకుంటే చంపేస్తాం.. రఘునందన్‌కు బెదిరింపు కాల్

తెలంగాణ బీజేపీ సీనియర్ నేత, మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు మరోసారి బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆపరేషన్ కగారు ఆపాలంటూ రెండు వేర్వేరు నంబర్ల నుంచి ఆగంతుకులు ఎంపీకి ఫోన్ చేసి హెచ్చరించారు. ఆపరేషన్ కగారు తక్షణమే ఆపకపోతే చంపేస్తామని బెదిరించారు. ఆంధ్రప్రదేశ్ మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమ్మల్ని చంపేందుకు తాము ఐదు టీమ్స్ హైదరాబాద్లో ఉన్నాయని, మరి కాసేపట్లో చంపేస్తామని హెచ్చరించారు. దమ్ముంటే ప్రాణాలు కాపాడుకోవాలని సవాల్ విసిరారు. మా ఫోన్లు ట్రేస్ చేసేందు కు యత్నిస్తున్నారని మాకు సమాచారం దొరికింది. అందుకే ఇంటర్నెట్ కాల్స్ వాడుతున్నాం. ఆపరేషన్ కగారు ఆపకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు. అని ఎంపీని హెచ్చరించారు. 9489556347, 7365035440 నంబర్ల నుంచి తాజాగా బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఈ నెలజూన్ 23న ఎంపీ రఘునందన్ రావుకు మొదటి బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వెంటనే ఆయన తెలంగాణ డీజీపీతో పాటు సంగారెడ్డి, మెదక్ ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com