Heavy Rainfall : మూడు రోజులు వానలే వానలు.. సర్కారు హైఅలర్ట్

Heavy Rainfall : మూడు రోజులు వానలే వానలు.. సర్కారు హైఅలర్ట్
X

రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశముందని వాతా వరణ శాఖ హెచ్చరించింది. అన్ని జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పేర్కొన్నారు. రాష్ట్రంలో గత వారం రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలపై రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంతరం సమీక్షిస్తున్నారని, జిల్లాల్లో ఏవిధమైన ప్రాణ నష్టం తోపాటు ఆస్తి నష్టం కూడా కలుగకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ముందుగానే, పునరావాస కేంద్రాల ఏర్పాటు పై చర్యలు తీసుకోవాలని, పోలీస్, ఇరిగేషన్, పంచాయతీ రాజ్, అగ్నిమాపక శాఖ, ఎన్టీఆరెఫ్, ఎన్టీఆరెఫ్ తదితర శాఖలతో సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్లకు సూచించారు. డీజీపీ జితేందర్, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాలు కూడా ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండాయని, అవి తెగ కుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు. ఇప్పటికే, ముందస్తు జాగ్రత్తలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో ఎన్టీఆరెఫ్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. అన్ని జిల్లాల్లో ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. ఏదైనా అత్యవసర సహాయం కావాలన్నా తమను ఏ సమయంలో నైనా సంప్రదించాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్ సూచించారు.

ప్రధానంగా లోతట్టు ప్రాంతాలు, చెరువు కట్టలు తది తర ప్రాంతాల వద్ద జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు సీఎస్. పారే వాగులను ఎవరూ దాటకుండా ఆయా ప్రాంతాలలో తగు బందోబస్తు ఏర్పాటు చేయాలని తెలిపారు. క్షేత్రస్థాయి అధికారులంతా తమతమ ప్రాంతాల్లో అందుబాటులో ఉండి పరిస్థితికి అనుగుణంగా తక్షణ చర్యలు చేపట్టాలని, వీలైనంత వేగంగా స్పందించాలని కోరారు.

Tags

Next Story