TG : విద్యుదాఘాతానికి ముగ్గురు రైతుల మృతి

TG : విద్యుదాఘాతానికి ముగ్గురు రైతుల మృతి
X

విద్యుదాఘాతానికి గురై ముగ్గురు రైతులు మృతి చెందారు. లింగాల మండలంలో ఒకరు, అచ్చంపేట మండలంలో ఇద్దరు మృతి చెందారు. అడవి పందులు భారీ నుండి పంటను కాపాడుకోవడానికి ఏర్పాటు చేసిన విద్యుత్ కంచే ఆ రైతును బలికొన్న విషాదకరమైన సంఘటన సూరాపూర్ గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన దేశ పర్వతాలు(40) అనే రైతు తన వ్యవసాయ పొలంలో మొక్కజొన్న పంటను అడవి పందులను రక్షిం చాలనే ఉద్దేశంతో బుధవారం రాత్రి పొలం చుట్టూ విద్యుత్ కంచెను ఏర్పాటు చేశారు. ఈ విషాయాన్ని మరిచిపోయిన రైతు గురువారం ఉదయం యథా విధిగా వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతి చెందిన పర్వతాలకు భార్య చిట్టమ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటు ంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అచ్చంపేట మండలం చేదురుబావి తండాలో బుధవారం రాత్రి పొలంలో సాగు నీరు పెట్టేందుకు వెళ్లిన రైతులు కాట్రావత్ లోక్యా (27) మూడవత్ కుమార్(27) లు విద్యుత్ షాక్ కు గురై అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన గురువారం ఉదయం వెలుగు చూసింది.

బావిలో బోరు పని చేయకపోవడంతో విద్యుత్ వైరును మరమ్మతులు చేసేందుకు బావిలోకి దిగిన ఇద్దరు రైతులకు విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి అయిన ఇంటికి చేరకపోవడంతో ఆయా కుటుంబ సభ్యులు వెతికారు. చివరకు పొలం వద్దకు వెళ్లగానే బావిలో రెండు మృతదేహాలు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీయించారు. పోస్టుమార్టం నిమిత్తం అచ్చంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సిద్దాపూర్ ఎస్సై పవన్ కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story