TG : పెద్దపులి దాడి.. మహిళ మృతి

TG : పెద్దపులి దాడి.. మహిళ మృతి
X

తెలంగాణ రాష్ట్రంలోని దట్టమైన అటవీప్రాంతం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పెద్దపులి దాడి చేసింది. ఈ దాడిలో ఓ మహిళ మృతి చెందడం సంచలనం రేపుతోంది. కాగజ్‌నగర్‌ మండలం నాజురూల్‌ నగర్‌ విలేజ్‌ నెంబర్‌ 11 వద్ద పత్తి చేనులో మొర్లే లక్ష్మిపై పెద్దపులి దాడి చేసింది. తీవ్రంగా గాయపడిన మహిళను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ లక్ష్మి మృతి చెందింది. దాంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు గ్రామానికి చేరుకుని పులుల రాకపోకలపై నిఘా చర్యలు, వ్యవసాయ ప్రాంతాల్లో గ్రామస్తుల రక్షణ చర్యలు తీసుకుంటున్నారు.

Tags

Next Story