TG : ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు

TG : ఇంటర్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు
X

రానున్న మార్చి 5 నుండి ప్రారంభ మయ్యే ఇంటర్ వార్షిక పరీక్షల నిర్వహణకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని చేయాలని జిల్లా విద్యా ధికారులకు ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య జూమ్ ద్వారా జిల్లా విద్యాధి కారులతో సమావేశమయ్యారు. పరీక్షా కేంద్రాలలో అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ఈ బాధ్యత ఆయా జిల్లా ల డీఐఈవోలు, నోడల్ అధికారుల దేనని తెలిపారు. స్ట్రాంగ్ రూమ్ల వద్ద కఠినమైన నిఘా ఉంచాలని, ఇందుకు జిల్లాల వారీగా కస్టోడియన్, డిపార్ట్ మెంటల్ అధికారులను నియమించాలని ఆదేశాలు జారీచేశారు. పరీక్షలను సజావుగా నిర్వహించడానికి ఫ్లయింగ్, సిట్టింగ్ స్క్వాడ్లను చేర్చడం ద్వారా కఠినమైన చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో ముందుగానే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షతన సంబంధిత డీఐఈవోలు కలిసి జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని, తదుపరి చర్యల కోసం పరీక్షల సిబ్బంది డేటాను బోర్డుకు పంపాలని కోరారు. అన్ని జిల్లాల పరీక్షా కమిటీ సభ్యులు, సంబంధిత జిల్లా అధికారుల సమన్వయంతో అన్ని జిల్లాల్లో పరీక్షలు సజావుగా నిర్వహించడానికి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు.

Tags

Next Story