Hyderabad : నేడే తిరంగా యాత్ర

ఆపరేషన్ సిందూర్ విజయవంతమైన నేపథ్యంలో బీజేపీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్ లో తిరంగా ర్యాలీ జరగనుంది. సాయంత్రం 5 గంటలకు ట్యాంక్ బండ్ పై ఈ యాత్రను నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ సింధూర్ లో భారత సైన్యం పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేసిన సందర్భంగ్ ఈ యాత్రలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జమ్మూ కశ్మీర్ డీజీపీతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ ర్యాంక్ అధికారులు, సైనిక అధికారులు, రక్షణ సిబ్బంది, కళాకారులు, బీజేపీ నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటున్నారు.జాతీయ జెండాలతో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. దేశభక్తి నినాదాలు, సైన్యానికి మద్దతుగా ఈ యాత్ర కొనసాగనుంది. తిరంగా యాత్ర నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. యాత్ర సాగే మార్గంలో ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. యాత్ర ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగుతాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com