రికార్డు స్థాయికి టమాట ధర..

కూరగాయల ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.టమాట గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.టమాట ధర రికార్డు స్థాయికి చేరడంతో సాధారణ ప్రజలు వాటిని కొనాలంటేనే భయపడుతున్నారు.దేశవ్యాప్తంగా కిలో టమాట యావరేజ్ గా 140 పలుకుతున్నది.అయితే పశ్చిమబెంగాల్‌లోని పురులియాప్రాంతంలో మాత్రం అత్యధికంగా 155కు చేరింది.ఎండల తీవ్రత పెరగడం, రూతుపవనాల రాక ఆలస్యమవడంతో టమాటా ఉత్పత్తి తగ్గిపోయిందని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.ఇక ముంబైలో అతితక్కువగా కిలో 58 పలుకుతుండగా,ఢిల్లీలో 110, చెన్నైలో 117 రూపాయలు పలుకుతోంది. ఇక స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బ్లిన్‌కిట్ వంట్ ఆన్‌లైన్ షాపింగ్ అప్లికేషన్స్ కిలో రూ.140 అమ్ముతున్నాయని వెల్లడించింది. ప్రస్తుత సీజన్ కారణంగా ధరలు అమాంతం పెరిగిపోయాయని, మరో 15 నుంచి నెల రోజుల్లో అవి దిగివచ్చే అవకాశం ఉందని సమాచారం.
గత కొద్ది రోజులుగా టమాట సరఫరా బాగా తగ్గిపోవడమే ధరల పెరుగుదలకు కారణమని హోల్‌సేల్ మార్కెట్ వ్యాపారులు చెబుతున్నారు.గత వారంలో అవసరాల కంటే తక్కువ పరిమాణంలో మార్కెట్ లోకి సరుకు వచ్చింది.ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక నుంచి దిగుమతి అయిన టమాటకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సరఫరా తక్కువగా ఉండటంతో డిమాండ్ పెరగడంతో పాటు ధరలు అనూహ్యంగా పెరిగాయని కన్పూర్ మార్కెట్ వ్యాపారులు అంటున్నారు.
ఇక మధ్యప్రదేశ్, ఏపీ, కర్ణాటకతోపాటు తమిళనాడు, ఒడిశా, గుజరాత్‌లలో టమాటా సాగు ఎక్కువగా చేస్తారు. మొన్నటి వరకు ఎండ, తీవ్రవడగాల్పులతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. రుతుపవనాల రాకతో పరిస్థితులు మారినా పలు ప్రాంతాల్లో పంట దెబ్బ తిన్నది. టమాటా సాగు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ ప్రభావం అధికంగా ఉండటంతో టమాట మోత మోగిస్తుంది. అయితే పంట నష్టంతోపాటు సరఫరాలో అంతరాయంతో ధరలు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయని మార్కెట్ నిపుణులు అంటున్నారు.చాలాచోట్ల టమాటా ధర ఇప్పటికే వందకు చేరుకోగా రుతు పవనాల విస్తృతి పెరిగిన తరువాత టమాట పంట సాగు పెరిగి ధరలు తగ్గే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు అంటున్నారు.
అయితే టమాటా సెంచరీ సాధించే స్థాయికి చేరుకున్నా దళారులు లాభాన్ని లాగేసుకోవడం వల్ల రైతులకు ప్రయోజనం కలగడం లేదు. రిటైల్ మార్కెట్‌లో మీడియం క్వాలిటీ టొమాటో కిలోకు వంద సఫాల్ స్టోర్‌లో కిలో 78 వరకు అమ్ముడవుతోంది. ఈ రెండు రకాలు మధ్యస్థ నాణ్యతతో ఉంటాయి.టాప్ క్వాలిటీ టమోటా ధర మాత్రం ఇంకా అధికంగానే ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com