Konda Surekha : కొండా సురేఖ జాగ్రత్త పడాల్సింది.. పీసీసీ చీఫ్ హాట్ కామెంట్

X
By - Manikanta |3 Oct 2024 4:45 PM IST
మహిళల మనోభావాలను కించపరచాలన్నది మంత్రి కొండా సురేఖ ఉద్దేశ్యం కాదన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్... కొండా వ్యాఖ్యలతో సినీ ప్రముఖుల మనసు నొచ్చుకుందని.. దానికి మంత్రి కొండా తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్నారన్నారు.. ఈ అంశం ఇక్కడితో ముగింపు పలకండని విజ్ఞప్తి చేశారు. ఇరువైపులా మహిళలు ఉన్నారని… కావున ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని కోరారు. సమాజంలో ఒకరి గురించి ఒకరు చెడుగా మాట్లాడవద్దని మా కాంగ్రెస్ నాయకులకు, మంత్రులకు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సూచించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com