తెలంగాణ

Revanth Reddy : బీజేపీ, టీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయి : రేవంత్ రెడ్డి

Revanth Reddy : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగింది.

Revanth Reddy (tv5news.in)
X

Revanth Reddy (tv5news.in)

Revanth Reddy : బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మధ్య ట్విట్టర్ వేదికగా వార్ జరిగింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్ట్, దానికి నిరసనగా జేపీ నడ్డా ప్రొటెస్ట్ పై రేవంత్ స్పందించారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి డ్రామా ఆడుతున్నాయని, ఇదంతా రాజకీయ దొంగాట అంటూ రేవంత్ ట్వీట్ చేశారు.

రేవంత్ కామెంట్స్ పై స్పందించిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బిఎల్ సంతోష్ కౌంటర్‌ ట్వీట్‌ ఇచ్చారు. మీరు అలా వెక్కిరిస్తూ ఉండండి.. బీజేపీ మంట మీకు తాకితే అర్పుకోవడానికి హుసేన్ సాగర్ ఉందని, 2023 లో చూసుకుందామని సంతోష్ ట్వీట్ చేశారు. ఐతే.. బీజేపీ నేత సంతోష్ ట్వీట్ కు రేవంత్ ఘాటుగా సమాధామిచ్చారు.

టీఆర్ఎస్, బీజేపీ ఆటలు తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని, బీజేపీని ప్రజలు బంగాళాఖాతంలో కలుపుతారని, 2023లో చూసుకుందామని రేవంత్ రీట్వీట్ చేశారు. మేము కాంగ్రెసు వాళ్ళమని, ఎవరికి భయపడమని కానీ బీజేపీ, టీఆర్ఎస్ భాయిభాయి అని రేవంత్ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Next Story

RELATED STORIES