Hyderabad : మియాపూర్‌లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో కుటుంబం మరణం

Hyderabad : మియాపూర్‌లో విషాదం.. అనుమానాస్పద స్థితిలో కుటుంబం మరణం
X

పొట్ట కూటి కోసం హైదరాబాద్ కు వలస వచ్చిన ఓ కుటుంబం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ఐదుగురు కుటుంబ సభ్యులు ఒకేసారి చనిపోవడం స్థానికంగా విషాదాన్ని నింపింది. హైదరాబాద్ మియాపూర్‌లో జరిగిన ఈ ఘటన అందరిని కంటతడి పెట్టించింది.

పోలీసుల వివరాల ప్రకారం.. కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా సేడం మండలం రంజోలి నుంచి హైదరాబాద్ కు వలస వచ్చింది ఓ కుటుంబం. వీరు లక్ష్మయ్య (60), వెంకటమ్మ(55), అనిల్‌ (32), కవిత (24), అప్పు (2) గా గుర్తించారు. మక్త మహబూబ్‌పేటలో నివాసం ఉంటున్న ఈ కుటుంబ సభ్యులు అనుమాస్పద స్థితిలో మరణించారు. మృతులలో రెండేళ్ల చిన్నారి కూడా ఉండటంతో అత్యంత విషాదకరం. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పసికందును చంపేసి మిగిలిన కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. లేదా ఎవరైనా చంపేశారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Next Story