Accident : చెవెళ్లలో ఘోరం.. లారీ ఢీ.. ముగ్గురు మృతి

బతుకుదెరువు కోసం రోడ్డు పక్కన రోజంతా కూరగాయలు అమ్ముకుంటూ ఆనందంగా జీవిస్తున్న కుటుంబాల్లో ఒక్కసారిగా చీకటి అలుము కుంది. లారీ రూపంలో వచ్చిన మృత్యువు, ఊహించని విధంగా మీదికి దూసుకొచ్చి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లా, చేవెళ్ల మండలం, ఆలూరు గేటు వద్ద జరిగింది. గత 8 ఏళ్లుగా ఆలూరు గ్రామం, ఇంద్రారెడ్డినగర్కు చెందిన రైతులు రోడ్డు పక్కన కూరగాయలు అమ్ముతూ జీవనం కొనసాగిస్తు న్నారు. ఎప్పటిలాగే ఇవాళ కూడా తమ వ్యాపారంలో నిమగ్నం అయి ఉండగా సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చేవెళ్ల నుంచి వికారాబాద్ వెళ్తున్న ఒక లారీ అకస్మా త్తుగా వారిపైకి దూసుకెళ్లింది. ఏం జరుగుతుందో తెలిసేలోపే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురికి తీవ్రగాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను వైద్యం నిమిత్తం హైదరాబాద్ తరలించారు. మృతులను ఆలూరు గ్రామానికి చెందిన నక్కలపల్లి రాములు, దామ రగిద్ద కృష్ణ, ఇంద్రానగర్కు చెందిన సుజాతగా పోలీసులు గుర్తించారు. గాయపడినవారిలో ఆకుల పద్మమ్మ, లారీ డ్రైవర్ తోపాటు మరొకరు ఉన్నట్లు తెలుస్తోంది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com