Rangareddy District : కాపాడండి.. లారీ టైర్ల కింద ఇరుక్కుని బీటెక్ స్టూడెంట్ ఆర్తనాదాలు.. కాసేపటికే..

Rangareddy District : కాపాడండి.. లారీ టైర్ల కింద ఇరుక్కుని బీటెక్ స్టూడెంట్ ఆర్తనాదాలు.. కాసేపటికే..
X

రంగారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. షాద్‌నగర్‌ చౌరస్తాలో ఇవాళ ఉదయం బైక్‌ను లారీ ట్యాంకర్‌ ఢీకొట్టింది. ఈ ఘటనలో బైక్‌పై వెళ్తున్న తండ్రి, కూతురు అక్కడికక్కడే మృతి చెందారు. షాద్‌నగర్‌కు చెందిన మచ్చేందర్‌.. తన కూతురిని కాలేజీ బస్సు ఎక్కిచేందుకు బైక్‌పై బస్టాప్‌కు బయలుదేరారు. షాద్‌నగర్‌ చౌరస్తా వద్దకు రాగానే వీరి బైక్‌ను ట్యాంకర్‌ లారీ ఢీకొట్టింది. తండ్రి ఘటనాస్థలిలోనే మృతి చెందగా, కూతురు మైత్రికి తీవ్రగాయాలై లారీ టైర్ల మధ్యలో ఇరుక్కుపోయింది. కాపాడండి అంటూ మైత్రి చేసిన ఆర్తనాదాలు అందరినీ కంటతడి పెట్టించాయి. కాసేపటికే అమ్మాయి కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు. తండ్రి కూతుళ్ల మరణంతో కుటుంబసభ్యులు బోరున విలపిస్తున్నారు. లారీ డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Tags

Next Story