TG : ఆధార్ కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో వైద్యం: తెలంగాణ ప్రభుత్వం

TG : ఆధార్ కార్డు లేకపోయినా ఆసుపత్రుల్లో వైద్యం: తెలంగాణ ప్రభుత్వం
X

ఆధార్ లేకపోయినా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్యం అందిస్తున్నట్లు తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. ఉస్మానియాలో ఆధార్ లేకపోతే వైద్యం చేయడంలేదంటూ హైకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై న్యాయస్థానం ప్రభుత్వ స్పందనను అడిగింది. ఉస్మానియాతో పాటు ఏ ప్రభుత్వ ఆసుపత్రిలోనైనా ఆధార్ లేకున్నా వైద్యం అందిస్తామని, భవిష్యత్తులోనూ ఇదే కొనసాగుతుందని ప్రభుత్వ లాయర్ స్పష్టం చేశారు. దీంతో పిల్‌ను ధర్మాసనం ముగించింది. ఉస్మానియా హాస్పిటల్‌లో అదే రోజు సదరు మహిళతోపాటు మరో 100 మందికి సైతం ఆధార్‌ కార్డు లేకుండానే చికిత్స అందించినట్లు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు నమోదు చేసిన ధర్మాసనం ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధార్ కార్డు లేకండా వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు ప్రభుత్వం వివరణతో సంతృప్తి చెందింది. పిటిషన్‌పై ఎలాంటి విచారణ అవసరంలేదని మూసివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

Tags

Next Story