Trial Run : మల్కాపూర్ పెద్ద చెరువులో యుద్ధ ట్యాంకుల ట్రయల్ రన్ సక్సెస్

X
By - Manikanta |14 Dec 2024 5:15 PM IST
సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలంలోని మల్కాపూర్ పెద్దచెరువులో బీఎంపీ యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ సక్సెస్ అయింది. కంది మండలం ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారు చేసిన ఈ యుద్ధ ట్యాంకర్లను మల్కాపూర్ పెద్ద చెరువులో పరీక్షించారు. ఇందులో బీఎంపీ కన్వర్షన్ వెహికల్, బీఎంపీ ఓవరాయిలింగ్ వెహికల్ను టెస్ట్ చేశారు. బీఎంపీ 2 యుద్ధ ట్యాంకర్లు 14 టన్నుల బరువున్న ప్పటికీ నీళ్లలో తేలుతూ ఓ పడవలా ప్రయాణం చేయడం వీటి ప్రత్యేకత. అదే విధంగా నేలపై 60– 65 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణిస్తాయి. ఓడీఎఫ్ ఏటా 130 యుద్ధ ట్యాంకులను తయారు చేసి ఆర్మీకి అప్పగించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com